ఫూలే ఆశయసాధనకు ముందుకి సాగుతాం..


Ens Balu
1
వైజాగ్ గ్రీన్ పార్క్
2020-11-28 16:36:54

దేశంలోని వెనుకబడిన వర్గాలు, నిమ్నజాతుల కోసం పోరాటం చేసి విజయం సాధించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతీరావు పూలే అని బీసీ విభాగం విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు  కంట్రెడ్డి రామన్న పాత్రుడు కొనియాడారు. శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా ఆంథోని నగర్ వద్ద వున్న జ్యోతీరావ్ ఫూలే విగ్రహానికి విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్, పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు మళ్ళ విజయప్రసాద్, తదితరులతో పూలమాలలు వేసిఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాత్రుడు మాట్లాడుతూ, సమాజంలో ఉన్న దురాచారాలకు , కుల వివక్షకు వ్యతిరేకంగా  150 ఏళ్ల క్రితమే ప్రజలను చైతన్యవంతులను చేసారని చెప్పారు. ఫూలే ఆశయ సాధనకు ప్రతీఒక్కరు నడుంబిగించి ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో  తైనాల విజయకుమార్ పార్టీ నాయకులు రవిరెడ్డి , పక్కి దివాకర్, బెహరా భాస్కరరావు,కోలా గురువులు,యతిరాజుల నాగేశ్వరరావు, అల్లంపల్లి రాజబాబు , పేర్లు విజయ్చందర్ విల్లూరి భాస్కర్రావు  ,  పిల్లి సుజాత, బుగత నర్సింగరావు, బోని శివరామకృష్ణ , సాగరిక తదితరులు పాల్గొన్నారు.