సామాజిక సంస్కరణలకు ఫూలే ఆధ్యులు..


Ens Balu
3
ఆంధ్రాయూనివర్శిటి
2020-11-28 16:50:46

సామాజిక మార్పులకు, సంస్కరణలకు జ్యోతిరావు ఫూలే ఆధ్యునిగా నిలుస్తారని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. శనివారం ఉదయం ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని ఏయూలోని ఆయన విగ్రహానికి వీసీ ప్రసాద రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ మహిళా విద్యకు ఫూలే చేసిన కృషి నిరుపమానమన్నారు. ఫూలే స్ఫూర్తిగా నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ ‌జగన్‌ ‌మోహన రెడ్డి   అట్డడుగు వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తున్నారన్నారు. బీసీల అభ్యున్నతికి,వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ఆటా అద్యక్షులు ఆచార్య జాలాది రవి, ఏయూఇయూ అద్యక్షుడు డా జి.రవికుమార్‌, ‌మత్స్యకార సంఘం అద్యక్షుడు మల్లేటి రాంబాబు, డీన్‌ ఎన్‌.‌సత్యనారాయణ, రాష్ట్ర బిసి సంఘం కార్యదర్శి పితాని ప్రసాద్‌ ‌తదితరులు పాల్గొన్నారు.