ఏయూ వీసి ప్రసాద రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువ..


Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-11-28 16:56:47

ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతూనే వుంది. శనివారం విసిని పలువురు అభినందించారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎం.జగన్నాధ రావు, మాజీ శాసన సభ్యులు పంచకర్ల రమేష్‌ ‌బాబు, ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, ఆంధ్రమెడికల్‌ ‌కళాశాల ప్రిన్సిపాల్‌ ‌పి.సుధాకర్‌, ‌పెద్దసంఖ్యలో అభిమానులు, ఆచార్యులు,ఉద్యోగులు, కళాశాలల ప్రతినిధులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రాయూనివర్శిటీలో ఎవరికీ దక్కని గౌరవం మీకు దక్కిందని కొనియాడారు, పరిశోధకులుగా, రెక్టార్ గా, ఇపుడు విసిగా మూడు ఉన్నత స్థానాలను అదిరోహించిన తొలివ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. ఆసియాలోనే అతి పెద్ద యూనివర్శిటీగా ఏయూ ఉందని, దీనిని సెంట్రల్ యూనివర్శిటీగా మార్పుచేసే కార్యక్రమం కూడా చేపట్టాలని వక్తలు సూచించారు. అందరి సహకారంతో యూనివర్శిటీని అభివ్రుద్ధి చేస్తామని విసి పివిజిగి ప్రసాదరెడ్డి హామీ ఇచ్చారు.