77లక్షల దొంగను 72 గంటల్లో పట్టుకున్నారు..
Ens Balu
3
Guntur
2020-11-28 17:17:01
గుంటూరు జిల్లాలో 77లక్షల బ్యాంకు దోపిడీ దొంగలను పోలీసులు 72 గంటల్లోనే పట్టుకొని మొత్తం నగదు రికవరీ చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ఆధ్వర్యంలో పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నారు. యూట్యూబు వీడియోలు చూసి దొంగతనం చేయడం నేర్చుకున్న దొంగలు మూడు రోజుల క్రితం స్థానిక బ్యాంకు నుంచి 77లక్షలను కొట్టేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మూడురోజుల్లోనే వారినిపట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, దొంగలు ఎంతటివారైనా పోలీసుల నుంచి తప్పించుకోవడం అసాధ్యమని అన్నారు. ప్రజలు ప్రభుత్వ సంస్థలు ఇలాంటి దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పుడు ఏం జరిగినా ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలనే విషయాన్ని గుర్తుపెట్టుకొని తమకు సమాచారం అందిస్తే ప్రజలకోసం తాము పనిచేస్తామని వివరించారు. ఈ దొంగతనం కేసులో చాకచక్యంగా వ్యవహించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. ఈ దొంగతనంలో ట్విస్ట్ ఏంటంటే గతంలో వీరిపై ఎలాంటి కేసులు లేవని కేవలం యూట్యూబులో వీడియోలు చూసి మాత్రమే వీరు దొంగతనాలు చేశారని ఎస్పీ వివరించారు.