దత్తత నియమాలు విధిగా పాటించాలి..
Ens Balu
2
Srikakulam
2020-11-28 17:24:15
దత్తత ఇచ్చేందుకు నియమ నిబంధనలు విధిగా పాటించాలని బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ గురుగుబిల్లి నరసింహమూర్తి అన్నారు. దత్తత మాసోత్సవాలలో భాగంగా జిల్లా మహిళ, శిశు అభివృద్ధి సంస్థ కార్యాలయంలో బాలల రక్షిత గృహాలు నిర్వహిస్తున్న సంస్థల సిబ్బందికి, ఐ.సి.పి.ఎస్ సిబ్బందికి పిల్లల దత్తత ఇచ్చే ప్రక్రియ, దత్తత ప్రక్రియలో బాలల రక్షిత గృహాల సిబ్బంది పాత్ర పై శని వారం ఒక రోజు శిక్షణా కార్యక్రమం జరిగింది. బాలల రక్షిత గృహాలలో పనిచేస్తున్న సిబ్బంది పిల్లల పట్ల ప్రేమతో ఉండాలని ఆయన పేర్కొన్నారు. పూర్తి అనాధ బాలలను గుర్తించి అటువంటి బాలల వివరాలను బాలల సంక్షేమ సమితి దృష్టికి తీసుకురావాలి ఆయన కోరారు. అటువంటి బాలల దత్తతకు అర్హతలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దత్తత పట్ల కౌన్సిలింగ్ సేవలు అందజేస్తూ వారికి ఒక మంచి కుటుంబాన్ని అందజేయాలని సూచించారు. దత్తత పట్ల గ్రామ స్థాయిలో మహిళా సంరక్షణ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా పెద్ద ఎత్తున ప్రజలలో అవగాహన కల్పించుటకు చర్యలు తీసుకోవలని కోరారు. ఐసిడిఎస్ అదనపు పథక సంచాలకులు పి.రాదా కృష్ణ మాట్లాడుతూ పిల్లల దత్తత విషయంలో బాలల రక్షిత గృహాల సిబ్బంది దత్తతకు అర్హులుగా ప్రకటించిన వారి చైల్డ్ స్టడీ రిపోర్ట్, ఆరోగ్య పరీక్షల నివేదికలు ఎప్పపటికప్పుడు తయారు చేయించి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలన్నారు. తద్వారా దత్తత ప్రక్రియను పటిష్టం చేయాలని కోరారు. పిల్లల దత్తతను ప్రోత్సహిస్తున్న బాలసదనం సూపరింటెండెంట్ బి.పుణ్యావతి, శిశుగృహ మేనేజర్ కె.నరేష్, శాంతాకళ్యాణ్ అనురాగ నిలయం ఇన్ చార్జి దేవేంద్ర ప్రసాద్ ను అతిథులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు బి.శశిభూషణ చౌదరి, ఆర్.జ్యోతి కుమారి, కె.సత్యవాణి, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం, ఎ.ఎస్.ఐ పి.వి.రమణ, జిల్లా బాలల రక్షణ విభాగం, డి.సి.పి.ఓ కె. వి.రమణ, జిల్లాలో బాలల రక్షిత గృహాల యాజమాన్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.