ఫ్రెడరిక్ ఎంగెల్స్‌కు సిపిఎం ఘన నివాళి..
Ens Balu
3
Jagadamba Junction
2020-11-28 17:35:21
కమ్యూనిస్టు సిద్ధాంతకర్త ఫ్రెడరిక్ ఎంగెల్స్ ద్విశత జయంతి సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, జిల్లా సీనియర్ నాయకులు ఎ.బాలకృష్ణ గార్లు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా శనివారం సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసి సమావేశంలో కె.లోకనాథం మాట్లాడుతూ కార్ల్‌మార్కస్, ఎంగెల్స్‌ను వేరువేర్వగా చెప్పలేమన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని రూపొందించడంలో ఇద్దరూ కీలకంగా వ్యవహరించారు. కీలకమైన అనేక గ్రంధాలను రచించారన్నారు. పెట్టుబడిదారీ ప్రపంచం యావత్తూ ఆర్థిక మాంద్యం, సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ తరుణంలో వారు రచించిన దాస్ కాపిటల్, పెట్టుబడి గ్రంధాలను పెట్టుబడుదారులు అధ్యయనం చేయాల్సి వస్తుందన్నారు. భారతదేశం నేడు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటుందన్న ఆయన బిజెపి నేతృత్వంలోని కేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగాన్ని, వ్యవసాయరంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతోందని ఆరోపించారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వరంగం, వ్యవసాయ రంగం పరిరక్షణ కోసం భారత్‌లో సాగుతున్న పోరాటాలను మరింత ఉధృతం చేయాలన్నారు. . అందుకు సకల శ్రామికుల్నీ ఐక్యం చేసి ప్రజా పోరాటానికి ఉద్యుక్తులు కావాలని.. అదే ఎంగెల్స్ మహాశయునికి ద్విశత జయంతికి నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.ప్రభావతి, జి.కోటేశ్వరరావు, డి.వెంకన్న, కె.సురేంద్ర, వి.ఉమామహేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు జి.నాయనబాబు, ఆర్.శంకరరావు, వి.వి.శ్రీనివాసరావు, ఎస్.వి.నాయుడు, గనిశెట్టి సత్యన్నారాయణ, జి.శ్రీరామ్, ఆర్.రాము, విహెచ్.దాసు, వి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.