సమన్వయకర్త పరీక్షకు 175 మంది హాజరు..


Ens Balu
2
Srikakulam
2020-11-28 18:26:46

శ్రీకాకుళం జిల్లాలోగ్రామ, వార్డు సచివాలయ శాఖలో జిల్లా, సహాయ, పట్టణ సమన్వయకర్తల పోస్టుల భర్తీకి జరిగిన పరీక్షకు 175 మంది హాజరయ్యారు. ఈ పరీక్షను శివాని ఇంజనీరింగు కళాశాలలో శనివారం నిర్వహించారు. దరఖాస్తు చేసిన అభ్యర్ధులలో అర్హతగల 197 మందికి పరీక్షకు హాజరు కావలసినదిగా సమాచారం అందించగా 175 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలను గ్రామ, వార్డు సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు శని వారం తనిఖీ చేసారు. ప్రజల చెంతకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించుటలో భాగంగా వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అందులో భాగంగా జిల్లాలో జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో పనిచేయుటకు జిల్లా సమన్వయకర్త , సహాయ జిల్లా సమన్వయకర్త, పట్టణ సమన్వయకర్త  పోస్టులను మంజూరు చేసారని ఆయన తెలిపారు. సమన్వయకర్తల బృందం గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధల ద్వారా జరుగుతున్న కార్యక్రమాల వివరాలు సేకరించడం, విశ్లేషించడం, అందులో మెరుగ్గా చేప్టటుటకు అవకాశాలు గుర్తించడం, బలహీనతలు, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు గుర్తించడం   తదనుగుణంగా విశ్లేషణ చేసి కార్యాచరణప్రణాళికలను రూపొందించడం చేయాల్సి ఉంటుందని డా.శ్రీనివాసులు తెలిపారు.