జివిఎంసికి హెచ్పీసీఎల్ సీఆర్ఎస్ నిధులు రూ.కోటి..


Ens Balu
3
జివిఎంసీ కార్యాలయం
2020-11-28 18:42:05

మహావిశాఖ నగర పాలక సంస్థ చేపడుతున్న స్వచ్చ సర్వేక్షణ్, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలకు ఆర్ధికంగా సహాయ సహకారాలు అందించేందుకు హెచ్.పి.సి.ఎల్.(విశాఖ రిఫైనరీ) ముందురావడం అభినందనీయమని కమిషనర్ డా.జి స్రిజన అన్నారు. శనివారం హెచ్పీసీఎల్ అధికారులు ఈ మేరకు కమిషనర్ కార్యాలయంలో ఈ సిఎస్ఆర్ నిధుల, వాటి  వినియోగానికి సంబంధించిన ఎంఓయూను జివిఎంసీ, హెచ్పీసీఎల్ అధికారులు  కుదర్చుకున్నారు. ఒప్పందం  ప్రకారం బి.పి.ఎల్. క్రింద పేదలకు చెత్తను వేరుచేసి అందించేందుకుగాను 3 రకాల డస్ట్ బిన్ లు పంపిణీ చేస్తారు. నగర పరిధిలోగల వార్డులలో పారిశుద్ధ్య పనులు నిమిత్తం పుష్ కార్ట్ లు పంపిణీతోపాటు ప్లాస్టిక్ క్రషింగ్ మిషన్లు కొనుగోలు కి ఆ నిధులు వినియోగిస్తామని కమిషనర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి అధనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ పాల్గొనగా, హెచ్.పి.సి.ఎల్.(విశాఖ రిఫైనరీ) యాజమాన్యం తరుపున  ఎగ్జిక్యుటివ్ డైరెక్టరు వి. రతన్ రాజు, డి.జి.ఎం. కె. నగేష్, సి.ఎస్.ఆర్ & పి.ఎస్., సీనియర్ మేనేజర్ కాళి తదితరులు పాల్గొన్నారు.