ప్రతీఒక్కరికీ ఆరోగ్య పథకం చేరాలి..


Ens Balu
2
Anantapur
2020-11-28 18:47:23

ఆరోగ్య శ్రీ ఫలాలను ప్రతి అర్హునికి అందించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిఆశయమని జాయింట్ కలెక్టర్ (గ్రామ/వార్డు సచివాలయాలు, అభివృద్ధి) మరియు ఆరోగ్యశ్రీ ఎక్స్ అఫిసియో అడిషనల్ ముఖ్య కార్యనిర్వణాధికారి డా.ఏ.సిరి తెలిపారు.శనివారం ఉదయం జేసీ క్యాంపు కార్యాలయంలో ఆమె డా.వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పై రూపొందించిన 3 రకాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆశయ సాధనలో భాగంగా ఈరోజు జిల్లా లోని 1208 సచివాలయంలో ఉన్న సచివాలయ ఆరోగ్యమిత్రల హెల్ప్ డెస్క్ లో ఈ పోస్టర్లను అతికించడం జరుగుతుందన్నారు.వీటిని జిల్లాలోని అన్ని సచివాలయాలలో అతికించి ప్రజలు ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా ఉపయోగించుకునేలా తెలియచేయవలసిన బాధ్యత సచివాలయ ఆరోగ్యమిత్రలపై ఉందన్నారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ  జిల్లా మేనేజర్ కె. శివకుమార్, జడ్పీ డిప్యూటీ సిఈఓ శ్రీనివాస్, మునిసిపల్ రీజినల్ డైరెక్టర్ నాగరాజు,టీం లీడర్ జి.టి.సుధాకర్, ఆరోగ్య మిత్ర నాగన్న తదితరులు పాల్గొన్నారు.