జ్యోతీరావు ఫూలేకి ఘనంగా నివాళి..
Ens Balu
3
Collector Office
2020-11-28 19:09:36
దేశంలోని వెనుకబడిన వర్గాలు, నిమ్నజాతుల కోసం పోరాటం చేసి విజయం సాధించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతీరావు పూలే అని జిల్లా వి.వినయ్ చంద్ కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి కార్యక్రమం బి.సి.సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ఉన్న దురాచారాలకు , కుల వివక్షకు వ్యతిరేకంగా 150 ఏళ్ల క్రితమే ప్రజలను చైతన్యవంతులను చేసారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలక్టర్ గోవిందరావు, డిఆర్వో, ఎ. ప్రసాద్, బిసి కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.