స్కాలర్ షిప్ దరఖాస్తులకు గడువు పెంపు..
Ens Balu
3
Srikakulam
2020-11-28 19:23:03
శ్రీకాకుళం జిల్లాలోని మైనారిటీ విధ్యార్ధులకు ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్, మెరిట్ కం మీన్స్ జాతీయ స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువును డిసెంబర్ 30 వరకు పొడిగించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పి.ఎన్.వి.లక్ష్మీనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇదివరలో జిల్లాలోని మైనారిటీలకు చెందిన ( ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, బుద్ధులు, పార్శీకులు,సిక్కులు ) విధ్యార్దులు ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ , మెరిట్ కం మీన్స్ జాతీయ స్కాలర్ షిప్స్ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు నవంబర్ 30 వరకు గడువు ఉండగా, కరోనా కారణంగా పాఠశాలలు, కళాశాలలు,విద్యాసంస్థలు నవంబర్ నెల నుండి ప్రారంభం అయినందున, ఆ గడువును డిసెంబర్ 30 వరకు పొడిగించినట్లు ఆయన చెప్పారు. అలాగే స్కాలర్ షిప్ దరఖాస్తు కొరకు విద్యార్హతలుగా ముందు తరగతుల్లో 50% మార్కులుగా వుండేదని, కానీ కోవిడ్ దృష్ట్యా విద్యార్థులు ముందు తరగతుల్లో ఉత్తీర్ణులైతే సరిపోతుందని ఆయన స్పష్టం చేసారు. కావున జిల్లాలోని మైనారిటీలకు చెందిన విద్యార్దులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు. ఇతర వివరాల కొరకు మైనారిటీ సంక్షేమ కార్యాలయం, కలక్టరేట్ కాంపౌండ్, విజయనగరం జిల్లా మొబైల్ నెంబర్లు 94904 98948, 82475 54334,94403 99588 ను సంప్రదించవచ్చని ఆయన వివరించారు.