అంటువ్యాధులు రాకుండా చూడండి..
Ens Balu
4
జివిఎంసీ కార్యాలయం
2020-11-28 19:33:08
రాష్ట్రాలలోని అన్ని మున్సిపల్ కార్పోరేషన్/మున్సిపాల్టీలలో అంటు వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి బొత్ససత్యన్నారాయణ ఆదేశించారు. శనివారం రాష్ట్రంలోని నివర్ తుఫాన్ వలన దెబ్బతిన్న విద్యుత్ శక్తి, నీటి సరఫరాలను త్వరితగతిన పునరిద్ధరించాలని అన్ని మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు. ఈమేరకు మున్సిపల్ కార్యదర్శి శ్యామలరావులతో కలసి అన్ని జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల నివర్ తుఫాన్ వలన కలిగిన నష్టాన్ని సంఘాల కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడానికి ఇప్పటి నుండే తగు చర్యలు చేపట్టాలని మంత్రివర్యులు అందరి కమిషనర్లను కోరారు. పట్టణ ప్రణాళిక విభాగంపై సమీక్షిస్తూ అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు నిరంతరంగా చేపట్టాలని సూచించారు. మున్సిపల్ పాఠశాలలో నాడు – నేడు పథకం కింద చేపడుతున్న పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అందుకు కేటాయించిన నిధులను పూర్తిగా వినియోగించాలని కమిషనర్లను ఆదేశించారు. జివిఎంసికి సంబందించి మంత్రి సమీక్షలో కార్పోరేషన్ కు సంబంధించి కమిషనర్ డా. జి. సృజన వివరణ ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో సి.డి.ఎం.ఎ. విజయ కుమార్, ఇ.ఎన్.సి. చంద్రయ్య, డి.టి.సి.పి. రాముడు తదితరులు పాల్గొనగా, జివిఎంసి తరుపున కమిషనర్ డా.జి. సృజన, అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు, సి.సి.పి. విద్యుల్లత, పి.డి.(యు.సి.డి.) వై. శ్రీనివాసరావు, పర్యవేక్షక ఇంజినీరు శివప్రసాదరాజు మొదలగు వారు పాల్గొన్నారు.