ట్రజరీ అకౌంట్స్ ఆఫీసర్ బదిలీ..


Ens Balu
2
Srikakulam
2020-11-28 19:51:08

శ్రీకాకుళం జిల్లా ఖజానా కార్యాలయంలో ఉప సంచాలకులుగా పనిచేస్తూ వి.ఎం.ఆర్.డి.ఎ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా  బదిలీపై వెళ్తున్న జి.నిర్మలమ్మను ట్రెజరీ కార్యాలయ సిబ్బంది కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఘనంగా సన్మానించారు. జిల్లా ఖజానా కార్యాలయంలో ఉప సంచాలకులుగా 4 ఏళ్లకు పైగా సేవలు అందించిన ఆమెకు కార్యాలయ సిబ్బంది దుశ్శాలువ, పుష్పగుచ్ఛం, జ్ఞుపికలు అందజేసి ఆత్మీయ వీడ్కోలు పలికారు. శ్రీకాకుళం జిల్లాలో మాదిరిగానే విశాఖపట్నం వి.ఎం.ఆర్.డి.ఏలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా ఉత్తమ సేవలు అందించి జిల్లాకు మంచిపేరును తీసుకురావాలని సిబ్బంది ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చేనేత మరియు జౌళి శాఖ సహాయ సంచాలకులు   యం.పద్మ, యస్.సి.కార్పొరేషన్ విశ్రాంత కార్యనిర్వాహక సంచాలకులు సిహెచ్.మహాలక్ష్మీ, ఉప ఖజానా అధికారి రాష్ట్ర ట్రెజరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భాగ్యలక్ష్మీ, కార్యదర్శి సురేష్, రాష్ట్ర ఖజానా శాఖ సంఘం కోశాధికారి భాస్కరరావు, సహాయ ఖజానా అధికారులు పి.సావిత్రి, ఎ.తవిటన్న, కె.శ్రీనివాసరావు, వి.వి.రమణమూర్తి,  ఇతర యస్.టి.ఓలు, ఇతర ట్రెజరీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.