నాకేం కాలేదు..కంగారు వద్దు


Ens Balu
2
Machilipatnam
2020-11-29 13:18:46

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపు(30వతేదిన) జరుగుతాయనగా ఆదివారం రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. మంత్రి తల్లి ఇటీవలే మ్రుతిచెందారు. ఆ సందర్భంగా దిన కర్మలు చేసి వస్తుండగా ఒక వ్యక్తి కాళ్లపై పడుతున్నట్టుగా నటించి చేతిలో వున్న ఇనుప ఆయుధాలతో మంత్రిని పొట్టలో పొడిచే ప్రయత్నం చేశాడు. మొదటిసారి అదికాస్తా బెల్టు బకిల్ కి తగలడంతో, రెండవసారి పొడిచేందుకు ప్రయత్నించగా మంత్రి చాకచక్యంగా తప్పించుకున్నారు. ఇంతలో పోలీసులు, కార్యకర్తలు మంత్రిపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని పట్టుకుని అరెస్టు చేశారు. అయితే ఈ నేపథ్యంలో తనకి ఏమీ కాలేదని మంత్రి ప్రకటించారు. అసెలెందుకు తనపై హత్యాయత్నం చేశారనే విషయాన్ని పోలీసులు కూపీలాగుతున్నారు. మంత్రిని హత్యచేసేందుకు వాడిన ఇంటిపనులు చేసే తాపీగా కనిపిస్తుంది. చాలా బలంగా ప్రయత్నం చేసిన తరుణంగో బెల్టుకి తగలడంతో అదికాస్తా పూర్తిగా వంకరపోయి మంత్రి ప్రాణాలతో బయటపడ్డారు. దీనితో అప్రమత్తమైన పోలీసులు, మంత్రిని చుట్టుముట్టి సేఫ్ గా బయటకు తీసుకు వచ్చారు. ఈ విషయమై మంత్రి స్పందిస్తూ, ఏదోలా దాడిచేయాలని ప్రయత్నించినా పనిజరలేదని అన్నారు. తన తల్లే తనను కాపాడిందని మంత్రి చెప్పుకొచ్చారు..