కరోనా నుంచి కోలుకున్న46 మంది డిశ్చార్జ్..
Ens Balu
2
అనంతపురం
2020-11-29 20:45:59
కరోనా నుంచి కోలుకోవడంతో 46 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఆదివారం అనంతపురం లో ఆయన మీడియతో మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ లు, కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు 46 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేసానట్టు వివరించారు. వారందరినీ 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని, బలవర్ధక ఆహారం తీసుకోవాల్సిందిగా సూచించామని కలెక్టర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రతీఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. దేవాలయాలు, ప్రయాణాలు చేస్తున్న సమయంలో నాణ్యమైన శానిటైజర్లు వినియోగించాలన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక పీహెచ్సీలో కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గంధం చంద్రుడు కోరారు.