శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం..


Ens Balu
2
Tirupati
2020-11-29 21:11:53

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాయంలో ఆదివారం కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని  సాయంత్రం కృత్తికా దీపోత్సవం జరిగింది.  కార్తీక మాసంలో శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ముందుగా, సాయంత్రం 6 గంటలకు గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపైన కొండపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్‌ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు.ఆ త‌రువాత‌ జ్వోలాతోరణం వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ ఈవో  సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్  భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్  రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.