రెడ్‌క్రాస్ లో 486 మంది బాలికల చేరిక..
Ens Balu
3
Vizianagaram
2020-11-29 21:20:53
విజయనగరం జిల్లా ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు చెందిన 486 మంది విద్యార్ధినులను జూనియర్ రెడ్‌క్రాస్‌లో సభ్యులుగా చేర్పించినట్లు జూనియర్ రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త రామ్మోహన్ తెలిపారు. పాఠశాల ప్రదానోపాధ్యయురాలు శోభారాణి నేతృత్వంలోప్రత్యేక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి బాలికలను చేర్పించామన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో బాలికలతో మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ రెడ్ క్రాస్ డి.ఎఫ్.ఓ.లు గౌరి, చంద్రరావు తదితరులు పాల్గొన్నట్టు పేర్కొన్నారు.