పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఓటర్ల నమోదు..
Ens Balu
2
Vizianagaram
2020-11-29 21:22:49
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు చేపట్టారు. శని, ఆదివారాల్లో బూత్ స్థాయి అధికారుల నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే నిమిత్తం ఆదివారం పలు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి బి.ఎల్.ఓ.లకు సూచనలు చేశారు. జాయింట్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ బొండపల్లి మండలంలోని గొట్లాం, అంబటివలస గ్రామాల్లోని పలు కేంద్రాలు సందర్శించి ఓటర్ల నమోదు జరుగుతున్న తీరును పరిశీలించారు. జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు డెంకాడ మండలంలోని పెద తాడివలస, భోగాపురం మండలం సవరవల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. విజయనగరం ఆర్.డి.ఓ. బిహెచ్.భవానీ శంకర్ నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.