21 నుంచి వైఎస్‌ఆర్ కప్..2020
Ens Balu
2
ఆర్కేబీచ్
2020-11-30 13:28:11
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 21 నుంచి వైఎస్‌ఆర్ కప్ 2020 క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం ఏయూ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టోర్నమెంట్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని 98 వార్డుల పరిధిలో 300కిపైగా టీములతో టోర్నమెంట్ నిర్వహణ జరుగుతుందన్నారు. దీనిలో పాల్గొనే వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ లో ఉచిత రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతాయన్నారు 12 వ తేదీ సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్లను అనుమతిస్తామన్నారు. నాకౌట్ పద్దతిలో పోటీలు జరుగుతాయన్నారు. మెత్తం 8 పూల్‌లుగా పోటీలను నిర్వహిస్తామన్నారు. మెదటి దశలో 12 ఓవర్ల మ్యాచ్‌గా నిర్వహిస్తామని, రెండో దశ పోటీలు 15 ఓవర్లకు మ్యాచ్ జరుగుతుందన్నారు. 16 గ్రౌండ్‌లను సిద్దం చేసామని,8 గ్రౌండ్‌లలో పోటీలు జరుపుతామన్నారు.
21న ప్రారంభోత్సవం...
టోర్నమెంట్ ప్రారంభోత్సవం ఈ నెల 21న ముఖ్యమంత్రి జన్మదినోత్సవం రోజున ఘనంగా నిర్వహిస్తామన్నారు. దీనిలో ఎంపీ వి.విజయసాయి రెడ్డి, భారతీయ క్రికెట్ క్రీడాకారుడు వేణుగోపాల్, పలువురు ప్రముఖులు పాల్గొంటారన్నారు. 22వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. ప్రతీ టీంకు బహుమతులను అందించడం జరుగుతుందన్నారు. మెగా టోర్నమెంట్ నిర్వహణ బాధ్యతను, సాంకేతిక సహకారాన్ని ఏయూ అందిస్తుందన్నారు.