ఏయూ 18వ వీసిగా ఆచార్య వివిజిడి ప్రసాదరెడ్డి..


Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-11-30 13:32:37

ఆంధ్ర విశ్వదవిద్యాలయం ఉపకులపతిని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి  ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం 11.55 గంటలకు ఆయన తన కార్యాలయంలో నిరాడంబరంగా వర్సిటీ 18వ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆచార్య ప్రసాద రెడ్డిని రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ‌పాలక మండలి సభ్యులు జేమ్స్ ‌స్టీఫెన్‌, ‌టి.శోభశ్రీ, క్రిష్ణమంజరి పవార్‌, ‌డీన్‌ ‌డాక్టర్‌ ‌టి.షారోన్‌ ‌రాజులు అభినందించారు. వర్సిటీ వీసీగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య ప్రసాద రెడ్డిని వర్సిటీ ఆచార్యులు, పరిశోధకులు, ఉద్యోగులు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ఏయూ మహిళా ఆచార్యుల సంఘం సభ్యులు వీసీకి అభినందనలు తెలియజేశారు. ఒక పరిశోధకుడిగా, రెక్టార్ గా, ఆ తరువాత ఇన్చార్జి విసిగా, ఇపుడు పూర్తిస్థాయి వీసిగా ఒకే వ్యక్తికి అరుదైన అవకాశం రావడం ఆంధ్రాయూనివర్శిటీలో అరుదైన అంశంగా చరిత్రకెక్కింది.