ఒక్కనెలలో 277 సెల్ ఫోన్లు రికవరీ చేశారు..
Ens Balu
2
చిత్తూరు
2020-11-30 16:45:39
పదునుతేలిన టెక్నికల్ ఎనాలిసిస్ వింగ్.. నైపుణ్య వృద్ది, నేరాల పరిశోధనలో సాంకేతికత మెలకువలను అందిపుచ్చుకొని ఒక నెల కాల వ్యవధిలోనే పిర్యాది దారులు పోగొట్టుకొన్న సుమారు 40 లక్షల విలువ గల 277 మొబైల్ ఫోన్ ల రికవరీ చేశారు చిత్తూరు జిల్లా పోలీసులు. ఆ సెల్ ఫోనులన్నీ పోగొట్టుకున్న బాధితులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్.పి. ఎస్.సెంథిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఎస్బీ డిఎస్పీ ఎన్. సుధాకర్ రెడ్డి నేతృత్వం లో టిఏడబ్ల్యూ టీంకు జిల్లా వ్యాప్తం గా ఒక్క సంవత్సర కాలం లో నమోదైన సెల్ ఫోన్స్ మిస్సింగ్ ల పై విచారణచేయాలని ఆదేశించడంతో 1 నెల కాల వ్యవధిలోనే ఫిర్యాది దారులు పోగొట్టుకొన్న సుమారు రూ.40 లక్షల విలువ గల 277 సెల్ ఫోన్స్ రికవరీ చేశారన్నారు. తరువాత ఎవరెవరు సెల్ ఫోన్లు పోగొట్లుకున్నారో వారి నెంబర్లు, ఇతర మొబైల్ బిల్స్ ఆధారంగా వారి ఫోన్లను వారికి అందజేసినట్టు ఎస్పీ వివరించారు. ఇందులో ఏపీతోపాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్ర ల నుంచి రికవరీ చేసినట్టు వివరించారు. ఎవరైనా ఏపి పోలీస్ సేవ యాప్ ద్వారా ఫిర్యాదు చేసినా వాటిపైనా తక్షణమే స్పందిస్తామని ఎస్పీ వివరించారు. అత్యంత తక్కువ కాల వ్యవధిలోనే సాంకేతికపర శిక్షణ పూర్తి చేసుకొని సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్న టిఏడబ్ల్యూ టీం, వారికి శిక్షణ ఇచ్చిన హెడ్ కానిస్టేబుళ్లు ఈ.దేవరాజులు రెడ్డి, కే. బాపూజీ, ఐటీ కోర్ టీమ్ వారిని ఎస్.పి ప్రత్యేకంగా అభినంధించి రివార్డులు అందజేశారు.