ఉత్తమ సేవలతో అసలైన సంతృప్తి..


Ens Balu
1
Srikakulam
2020-11-30 18:26:33

ఉత్తమ సేవలతో సంతృప్తి లభిస్తుందని మార్పు ప్రత్యేక అధికారి పి.రంజనీకాంతారావు అన్నారు. ఎచ్చెర్ల ఐటిఐ ప్రన్సిపాల్ , జిల్లా ప్రభుత్వ ఐటిఐల కన్వీనర్ రాడా కైలసరావు సోమవారం పదవీ విరమణ చేసారు. ఈ సందర్భంగా ఐటిఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో రజనీకాంతారావు పాల్గొన్నారు. సుదీర్ఘ సేవలు అందించి, ఐటిఐల అభివృద్ధికి కైలాస రావు కృషి చేసారన్నారు. ఉత్తమ సేవలతో స్వయం సంతృప్తి లభిస్తుందని పేర్కొన్నారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి జి.శ్రీనివాస రావు మాట్లాడుతూ కైలాస రావు చిత్తశుద్ధితో విధులు నిర్వహించారన్నారు. ఆదర్శప్రాయమైన సేవలు అందించారని పేర్కొన్నారు.  ఉద్యోగ విధులు అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించారని ప్రశంసించారు. రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులైన అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ జిల్లాలో మంచి సమన్వయంతో ఐటిఐ కార్యకలాపాలు నిర్వహించారన్నారు. ఐటిఐ సహాయ సంచాలకులు రామకృష్ణ మాట్లాడుతూ సుదీర్ఘకాలం సేవలు అందించి ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందారన్నారు. పదవీ విరమణ చేసిన కైలాస రావు మాట్లాడుతూ విధులను కష్టంతో కాకుండా ఇష్టంతో నిర్వర్తించానన్నారు. తద్వారా పని పట్ల ఏకాగ్రత నిలపగలిగానన్నారు. విద్యార్ధులకు చక్కని బోధన అందించడం, సంస్ధలో మౌళిక సదుపాయాలు కల్పనకు కృషి చేసానని చెప్పారు. ఉద్యోగ జీవితం సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు.  ఈ  కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్ బాబా, వివిధ ఐటిఐల ప్రిన్సిపాల్స్, రాష్ట్ర ప్రైవేటు ఐటిఐల సంఘం సభ్యులు  నాగభూషణ రావు, మొదలివలస రమేష్, ఇంటాక్ సభ్యులు సురంగి మోహన రావు., ఎస్.కె.నాయుడు, తదితరులు పాల్గొన్నారు.