స్పందన అర్జీలపై తక్షణమే చర్యలు చేపట్టాలి..


Ens Balu
2
GVMC office
2020-11-30 18:32:51

జివిఎంసి స్పందన ఫిర్యాదులపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించాలని కమిషనర్ డా.స్రిజన ఆదేశించారు. సోమవారం జివిఎంసిలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను ఆయనా శాఖలు, జోన్లకు బదలాయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన స్పందనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లో సమాచారం అందించాలన్నారు. ఈ రోజు నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఒకటవ జోనుకు 02, రెండవ జోనుకు 07, మూడవ జోనుకు 07, నాల్గవ జోనుకు 03, అయిదవ జోనుకు 04, ఆరవ జోనుకు 07, మొత్తము 30 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ డా. జి. సృజన ప్రధాన కార్యాలయ విభాగపు ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు ఆషాజ్యోతి, రమణి, సన్యాసిరావు, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వరరావు, సి.సి.పి.విద్యుల్లత, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ వై. మంగపతిరావు, పి.డి. (యు.సి.డి) వై. శ్రీనివాసరావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జె.డి.(అమృత్) విజయ భారతి, డి.సి.(ఆర్) ఎ. రమేష్ కుమార్, ఏ.డి.హెచ్ దామోదర రావు, ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ తదితరులు పాల్గొన్నారు.