పోలీస్ స్పందనలో సత్వర పరిష్కారం..


Ens Balu
1
Tirupati
2020-11-30 18:57:30

తిరుపతి అర్బన్ జిల్లా పోలీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పందన పై సత్వరం పరిష్కారం చూపించాలని సిబ్బందిని ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో స్పందనలో అడ్మిన్ ఎస్పీలు సుప్రజ, ఆరిఫుల్లు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అడ్మిన్ ఎస్పీలు మాట్లాడుతూ, ఈరోజు స్పందనలో  జిల్లా యస్.పి కార్యాలయానికి 35 ఫిర్యాదులు వచ్చాయన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలోని ప్రజలు నేరుగా వచ్చి కలిసి తమ యొక్క సమస్యల తెలియజేశారన్నారు. వారి యొక్క సమస్యలకు సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరిని కేసు విషయాలు అడిగి తెలుసుకొని సంబందిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించి ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసినట్టు వివరించారు. అంతేకాకుండా   ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకార విచారణ జరిపి, నిర్దేశించిన గడువు లోగా ఫిర్యాదు దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు వారికి సమాచారం కూడా అందిస్తామన్నారు. ముఖ్య సమస్యలపై పోలీసు అధికారులను కూడా యస్.పి స్పందన కార్యక్రమానికి పిలిపించి ఇక్కడే స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్టు అడ్మిన్ ఎస్పీలు వివరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.