రక్త పరీక్షలు చేయని ఆసుపత్రి ఎందుకు..
Ens Balu
2
Gopalapatnam
2020-11-30 18:58:42
విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో కనీసం రక్త పరీక్షలు కూడా చేయకపోతే ఇక్కడ ఆసుపత్రి ఎందుకి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పాలిమర్స్ బాధితుల కోసం ఏర్పాటుచేసిన ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ ఆసుపత్రిలో కనీసం సుగర్, బీపీ పరీక్షలు కూడా చేయకపోవడం దారుణమన్నారు. ఇంత ఆసుపత్రి ఏర్పాటు చేసి కనీసం ల్యాబ్ టెక్నీషియన్ ను నియమించకపోవడాన్ని బట్టే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో అర్ధమవుతుందని ఆయన మీడియాతో చెప్పారు. హైపవర్ కమిటీ చేసిన సూచనలు తక్షణమే అమలు అయ్యే దిశగా ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన బాదితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దయచేసి హైపవర్ కమిటీ నివేదికను బుట్టదాఖలు చేయొద్దని, ల్యాబ్ టెక్నీషియన్లను నియమించి ముందు రోగులకు రక్తపరీక్షలు చేయాలని సూచించారు..హైపర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగాప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.