గ్రామసచివాలయంలోనే ఫిర్యాదు చేయండి..


Ens Balu
2
Kadapa
2020-11-30 19:39:43

పోలీసు సంబంధిత ఫిర్యాదులు ఇకపై గ్రామసచివాలయాల్లోని మహిళా సంరక్షణా కార్యదర్శిలకు అందజేయాలని కడపజిల్లా ఎస్పీ కెకెఎన్ అన్బురాజన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి గ్రామసచివాలయంలోని ఫిర్యాదు చేసిన అర్జీ దారులతో వీడియోకాన్ఫరెన్సు ద్వారా మాట్లాడి స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఫిర్యాదుదారుల సమస్యలను నిర్ణీత సమయంలో విచారించి పరిష్కరిస్తామని ఎస్.పి భరోసా ఇచ్చారు. జిల్లాలోని ఫిర్యాదుదారులు 'స్పందన'  ఫిర్యాదులను వారి వారి వార్డు, గ్రామ సచివాలయంలోని మహిళా పోలీసు (గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి) ల కు అందచేయాలని, వారు ఫిర్యాదులను జిల్లా పోలీసు కార్యాలయానికి స్కాన్ చేసి పంపుతారని, వాటిని ఆయా పోలీస్ స్టేషన్ల ద్వారా  సంబంధిత వార్డు, గ్రామ సచివాలయాలు పరిధిలోని పోలీసు అధికారులు విచారించి న్యాయం చేస్తారని జిల్లా ఎస్.పి తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 'కరోనా' వైరస్ తీవ్రత దృష్ట్యా వ్యయ  ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ఫిర్యాదు దారులకు మరింత చేరువయ్యేందుకు ఈ విధానం రూపొందించడం జరిగిందని ఎస్.పి వివరించారు..