90% పూర్తైన జిందాల్ విద్యుత్ ప్రాజెక్టు..


Ens Balu
2
కాపులుప్పాడ
2020-11-30 20:34:44

చెత్త నుంచి విధ్యుత్ తయారు చేసే ప్రాజెక్టు పని 90శాతం పూర్తి అయ్యిందని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన అన్నారు. సోమవారం కాపులుప్పాడ  డంపింగు యార్డులో జిందాల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న చెత్త నుంచి విధ్యుత్   తయారు చేసే ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇంకా మెకానికల్, కరంటు వంటి చిన్న చిన్న పనులు ఉన్నాయని డిశంబరు నెలాఖరుకి పూర్తిస్థాయిలో పనులు పూర్తిచేయాలన్నారు. వీలుంటే జనవరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తారని తెలిపారు. చెత్త డంపు చేయడానికి, ర్యాంపు, రోడ్లు పూర్తీ స్థాయిలో పూర్తయ్యాయన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని వచ్చిన చెత్తను ఏ విధంగా క్రమబద్దీకరిస్తున్నామో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం వారు స్వయంగా చూస్తారని అన్నారు. గత సంవత్సరం లో పోల్చుకుంటే నుండే కొన్ని నూతన పద్దతుల ద్వారా చెత్తను క్రమబద్దీకరిస్తున్నామన్నారు. ఈ విధ్యుత్ ప్రాజెక్టు యొక్క కెపాసిటీ 1200 మెట్రిక్ టన్నులని, సుమారు 1000 మెట్రిక్ టన్నుల చెత్త మన జివిఎంసియే  సమకూర్చుతుందని ఇంకా ప్రక్కన ఉన్న మున్సిపాలిటీలైన విజయ నగరం, శ్రీకాకుళం నుండి తెప్పించడానికి   ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎక్కువ సామర్ధ్యంగల విధ్యుత్ ప్రాజెక్టును ముందుగానే మనం ప్లాన్ చేసుకున్నామన్నారు.  అనంతరం డంపింగు యార్డు వద్ద ఉన్న బయో మైనింగు ప్లాంటును పరిశీలించి సుమారు 25 నుండి   30 సంవత్సరములుగా ఇక్కడ చెత్త నిల్వ ఉన్నందున మొదటి దశగా 25 ఎకరాలలో ఉన్న చెత్తను బయో మైనింగు చేసి, చుట్టూ ప్రక్కల ఎటువంటి దుర్వాసన రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా ఇందులో ముఖ్యంగా పార్కులు వంటివి ఏర్పాటు జరుగుతున్నాయని తద్వారా ప్రజలకు మంచి వాతావరణం కల్పిస్తామన్నారు.  భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, విశాఖపట్నం సందర్శిస్తున్న సందర్భంగా సాగర్ నగర్ లోని అయన నివాసముండే పరిసరప్రాంతాలలో పారిశుద్ధ్యం, రోడ్లు తదితర పనులను పరిశీలించారు. ఆ ప్రాంతంలోని పారిశుద్ధ్యం, ఫాగ్గింగు వంటి పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని  అదనపు కమిషనర్ వి. సన్యాసిరావును ఆదేశించారు. రోడ్లపై పాట్ హోల్సును పూడ్చాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు.    ఈ కార్యక్రమంలో అదనపు కమిషనరు వి. సన్యాసిరావు, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వరరావు, పర్యవేక్షక ఇంజినీరు కె.వి.ఎన్.రవి, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, వెంకటేశ్వర రావు, జిందాల్ ప్రాజెక్టు బయో మైనింగు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.