తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..


Ens Balu
2
Tirumala
2020-12-01 12:00:32

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బ్రేక్ దర్శనంలో డ్రమ్స్ ప్లేయర్ శివమణి, ప్రముఖ సినీ దర్శకుడు బాబీ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేష్ కుమార్,కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్,గంటా శ్రీనివాస‌ రావులు దర్శించుకున్నారు. ఎమ్మేల్యేకు మాత్రం స్వామివారి శేష వస్త్రాలను దేవస్థానం అధికారులు అందజేశారు. తిరుమలకి డ్రమ్స్ ప్లేయర్ శివమణి, సినీదర్శకులు బాబి రావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా వుందని, దేశంలో కరోరానా తగ్గి జనజీవితం మళ్లీ సాధారణంగా మారాలని కోరుకున్నట్టు వారు తెలియజేశారు.