ఎయిడ్స్ నివార‌ణ‌కు కృషి చేయాలి..


Ens Balu
1
Vizianagaram
2020-12-01 12:03:42

ఎయిడ్స్ నివార‌ణ‌కు కృషి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ పిలుపునిచ్చారు. విస్తృత‌మైన అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా ఈ వ్యాధిని నివారించ‌వచ్చ‌ని అన్నారు.  ప్ర‌పంచ ఎయిడ్స్ దినోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని ఆన్‌లైన్ ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు.* హెచ్ఐవి సోకిన‌వారిప‌ట్ల సంఘీభావం తెలుపుదాం, భాగ‌స్వామ్యంతో బాధ్య‌త వ‌హిద్దాం* అన్న నినాదంతో ఈ ఏడాది ఎయిడ్స్ దినోత్స‌వాన్ని నిర్వ‌హించారు. ఈ దినోత్స‌వ సంద‌ర్భంగా నిర్వ‌హించిన క్విజ్ పోటీల విజేత‌ల‌కు న‌గ‌దు బ‌హుమ‌తిని, ప్ర‌శంసా ప‌త్రాన్ని క‌లెక్ట‌ర్ అంద‌జేశారు. మొద‌టి బ‌హుమ‌తిని  ఆర్‌.సాయికుమార్‌, ద్వితీయ బ‌హుమ‌తిని జె.ప్ర‌శాంత్‌, తృతీయ బ‌హుమ‌తిని టి.చంద్ర‌శేఖ‌ర్ గెలుచుకున్నారు.                   ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ చికిత్స కంటే నివార‌ణే ఎయిడ్స్‌కు ఏకైక మార్గ‌మ‌న్నారు. ఈ ఈ వ్యాధిని త‌రిమికొట్ట‌డానికి ప్ర‌తీఒక్క‌రిలో సంపూర్ణ అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. హెచ్ఐవి వ్యాధిగ్ర‌స్తుల ఆరోగ్యాన్ని కాపాడ‌టం, కొత్త‌వారు ఈ వ్యాధి బారిన ప‌డ‌కుండా చూడ‌టం మ‌న ల‌క్ష్యం కావాల‌ని సూచించారు. ఎయిడ్స్ వ్యాధిగ్ర‌స్తుల జీవితకాలాన్ని పెంచేందుకు త‌గిన అవ‌గాహ‌న పెంపొందించి, వారు పౌష్టికాహారాన్న, అవ‌స‌ర‌మైన మందుల‌ను తీసుకొనేలా చూడాల‌న్నారు. అలాగే ఆరోగ్య‌ప‌ర‌మైన అల‌వాట్ల‌ను ప్ర‌తీఒక్క‌రికీ అల‌వాటు చేయడం ద్వారా ప‌లు ర‌కాల వ్యాధుల బారిన ప‌డ‌కుండా కాపాడ‌వ‌చ్చ‌ని సూచించారు. జిల్లాలో ఎయిడ్స్ నివార‌ణ‌లో ప్ర‌భుత్వ శాఖ‌ల‌తోపాటు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు కూడా మెరుగైన పాత్ర పోషిస్తున్నాయ‌ని, భవిష్య‌త్తులో కూడా ఇదే స‌హ‌కారాన్ని కొన‌సాగించాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.                  ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌, జిల్లా అద‌న‌పు వైద్యారోగ్య‌శాఖాధికారి మ‌రియు ఎయిడ్స్ కంట్రోల్ ఆఫీస‌ర్‌ డాక్ట‌ర్ జె.ర‌వికుమార్‌, జిల్లా అద‌న‌పు డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎల్‌.రామ్మోహ‌న‌రావు, పాజిటివ్ నెట్‌వ‌ర్కు ప్ర‌తినిధి ప‌ద్మావ‌తి, వ‌ర్చువ‌ల్ కాన్ఫ‌రెన్స్‌లో ఎన్‌వైకె కో-ఆర్డినేట‌ర్ విక్ర‌మాధిత్య‌,  ఎన్‌సిసి, ఎన్ఎస్ఎస్, రెడ్‌రిబ్బ‌న్ క్ల‌బ్ వాలంటీర్లు, ఎన్‌జిఓ ప్ర‌తినిధులు, ఏఆర్‌టి కౌన్సిల‌ర్లు, ఎయిడ్స్ కంట్రోల్ సిబ్బంది పాల్గొన్నారు.