ట్రాఫిక్ పోలీసులకు వైర్ లెస్ సెట్లు పంపిణీ..


Ens Balu
2
సంకల్ భాగ్ ఘాట్
2020-12-01 16:51:55

కర్నూలు నగరంలో మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ కోసం వాకీటాకీలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ నిధులు రూ.7.50 లక్షలతో కొన్న 30 పోలీస్ కంట్రోల్ వైర్లెస్ సెట్స్ ను తుంగభద్ర పుష్కరాల ముగింపు రోజున సంకల్ బాగ్ ఘాట్ వద్ద కలెక్టర్ పోలీసులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నిర్వహణకు ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ డికే బాలజీ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వీటిని పోలీసులకు అందజేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో  ట్రాఫిక్ డీఎస్పి మహబూబ్ బాషా మొదటి సెట్ ను అందుకోగా, ఇతర సెట్లను సిబ్బంది స్వీకరించారు. ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.