ఘనంగా ముగిసిన తుంగభద్ర పుష్కరాలు..


Ens Balu
3
Tungabhadra River Bank
2020-12-01 17:15:26

కర్నూలు జిల్లాలోని తుంగభద్ర పుష్కరాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఉదయం జిల్లాకలెక్టర్ వీరపాండియన్, నగరపాలక సంస్థ కమిషనర్ డికెబాలజీ దంపతులు పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి వేదపండితుల ఆశీర్వచనాలు పొందారు. సంకల్ బాగ్ ఘాట్ వద్ద మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో దేవాదాయ శాఖ వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆది పుష్కరాల ముగింపు హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నతాధికారుల దంపుతులు పుష్కరిణికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలోని ముఖ్య అధికారుల రాక సందర్భంగా, పుష్కరాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  ఈకార్యక్రమంలో ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్, పలువురు జిల్లా అధికారులు, దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు.