గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీకి చర్యలు..


Ens Balu
2
Srikakulam
2020-12-01 17:39:58

శ్రీకాకుళం జిల్లాలో గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీకి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీకి కార్యాచరణపై మంగళవారం సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా లక్ష్యాలను నిర్ణయించాలని ఆయన ఆదేశించారు. వై.యస్.ఆర్ చేయూత పథకం క్రింద ప్రయోజనం పొందిన లబ్ధిదారుల వివరాలు పరిశీలించాలని పేర్కొన్నారు. గొర్రెలు, మేకలు కొనుగోళుకు అవసరమగు మార్కెట్లను పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ఆసరా, సంక్షేమ విభాగం జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ వై. యస్. ఆర్ చేయూత పథకం క్రింద గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని చెప్పారు. చేయూత క్రింద అందిన మొత్తం బ్యాంకు ఖాతాలలో ఉండాలని అటువంటి లబ్దదారులను పరిగణనలోకి తోసుకోవాలని సూచించారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 1000 యూనిట్లు లక్ష్యం కాగా 5296 మంది దరఖాస్తు చేశారని చెప్పారు. జిల్లాలో 10 మండలాల్లో మేకలు, గొర్రెలు అధికంగా పెంచుతున్నారని, అటువంటి ఆసక్తి ఉన్నవారికి యూనిట్లు మంజూరు వలన ప్రయోజనం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ జెడి ఏ.ఈశ్వర రావు, డి ఆర్ డి ఏ పిడి బి.శాంతి, డిసిఓ కె.మురళి కృష్ణ మూర్తి, ఎల్డిఎం జి విబిడి హరి ప్రసాద్, ఎపిడిలు తదితరులు పాల్గొన్నారు.