కోవిడ్ బిల్లులు సకాలంలో సమర్పించాలి..
Ens Balu
3
Srikakulam
2020-12-01 17:57:37
శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ బిల్లులు తక్షణం సమర్పించాలని జిల్లా కలెక్ట్ జె నివాస్ కోరారు. జిల్లాలో కోవిడ్ నివారణా చర్యలలో భాగంగా పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అందులో భాగంగా వివిధ శాఖల ద్వారా వివిధ పనులను నిర్వహించామని అన్నారు. నవంబరు 30 నాటికి పెండింగులో ఉన్న కోవిడ్ సంబంధిత బిల్లులను సంబంధిత శాఖ అధికారి ద్వారా జిల్లా రెవిన్యూ అధికారికి వారం రోజుల్లోగా సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. నిర్ణీత సమయంలోగా సమర్పించని బిల్లులను పరిగణనలోకి తీసుకోవడం జరగదని ఆయన స్పష్టం చేసారు. సంబంధిత శాఖల అధికారులు పెండింగు బిల్లుల సమర్పణలో తగు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. అదే సమయంలో ఆయాశాఖ సిబ్బంది బిల్లులను ఏవో కారణాలు చూపి తొక్కిపెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమర్పించిన అన్ని బిల్లులకు ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఆదేశించారు..