రేపే అమూల్ పాలసేకరణ ప్రారంభం..


Ens Balu
1
Tirupati
2020-12-01 18:24:32

రాష్ట్ర ప్రభుత్వం ప్ర తిష్టాత్మకంగా పాడి రైతులకు మరింత లాభం చేకూర్చేందుకు అమూల్ సంస్థ తో కుదుర్చుకున్న అవగాహ న ఒప్పందం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా డిశం బర్ 2 న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్. జగన్ మెహన్ రెడ్డి విజయవాడ నుంచి వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా మధ్యాహ్నం 1 గంట కు చిత్తూరు, ప్రకాశం , వైఎ స్సార్ కడప జిల్లాలలో లాంఛనంగా పాల కొనుగో లును ప్రారంభిస్తారని ,ఈ కా ర్యక్రమానికి సంబందించి చి త్తూరు జిల్లాలో అధికార యంత్రాంగం అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.నారాయణ భ రత్ గుప్తా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.     చిత్తూరు జిల్లా కు సంబం దించి మదనపల్లి మండలం, వేంపల్లి వేదికగా కార్యక్రమం  లాంఛనం గా ప్రారంభమవు తుందని, వేంపల్లి తో పాటు సి .టి.ఎం, కొండామార్రి పల్లి, వలసపల్లి, పెంచు పాడు, అంకిశెట్టి పల్లి, చిప్పిలి ప్రాంతాలలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమాన్ని పాడి రైతులందరూ వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, లాంఛనంగా వేంపల్లి లో ప్రారంభమయ్యే కార్యక్రమంలో ప్రజా ప్రతి నిధులు, అధికారులు పాల్గొంటారని తెలిపారు.       జిల్లాలో పశ్చిమాన మం డలాలలో పాల దిగుబడి అధికంగా ఉన్న కారణంగా  మదనపల్లి, రామసముద్రం మండలాలలో  మొత్తం 32  రైతు భరోసా కేంద్రాల  పరి ధిలో (మదనపల్లి -18, రామసముద్రం -14 రైతు భరోసా కేంద్రాలు), వంద  గ్రామాలను ఈ కార్యక్రమం లో ఎంపిక చేయడం జరి గిందని,ఎంపిక చేసిన గ్రా మాలలో వై ఎస్సార్ చేయూ త, వైఎస్సార్ ఆసరా పధకా ల కింద 10,800 పశువులు (పాడి పశువులు, చూడి పశువులు ) అందజేయ డమే లక్ష్యం కాగా.. 1035 మంది ని ఈ రెండు మండ లాలలో అర్హులుగా గుర్తించ డమైనదని ,డిశంబర్ 2 న వేంపల్లి వేదికగా 168 మంది కి పాడి పశువులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.