ఉత్సాహంగా వైఎస్సార్ క్రికెట్ కప్ పోస్టర్ ఆవిష్కరణ..


Ens Balu
3
Visakhapatnam
2020-12-01 19:06:33

విశాఖలోని 35వ వార్డు ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో మంగళవారం వైయస్సార్ క్రికెట్ కప్ పై విల్లూరి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ బ్రోచర్లు విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన ఆమట్లాడుతూ, డా వైఎస్సార్ పేరుతో క్రికెట్ కప్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని, అందులో యువ క్రికెటర్లకు పోటీ ఏర్పాటు చేయడం ద్వారా వారిలోని క్రీడా సామర్ధ్యాన్ని వెలికి తీసినట్టు అవుతుందని అన్నారు. విశాఖలోని అన్ని ప్రాంతాల నుంచి ఎన్నో జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయని, దానికోసం అన్ని వర్గాల వారు ఈ వైఎస్సార్ క్రికెట్ కప్ ప్రచారం విరివిగా చేపడుతున్నారని అన్నారు. అంతకుముందు ఆటవిడుపుగా బౌలింగ్, బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. యువ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ రోలర్ స్కేటింగ్ రాష్ట్ర అధ్యక్షుడు శీలం లక్ష్మణ్, ఫుట్బాల్ కోచ్ బాబు, బుజ్జి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.