వైరల్ లోడ్ మెషీన్ ప్రారంభం..


Ens Balu
1
Srikakulam
2020-12-01 19:13:07

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా  హెచ్.ఐ.వి రోగులకు నిర్ధారణ పరీక్షలను నిర్వహించేందుకు వైరల్ లోడ్ మెషీన్ ను మంగళవారం రిమ్స్ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రారంభించారు. ఈ మెషిన్ సామర్ధ్యం 8 గంటలలో సుమారు 93 మంది యొక్క వైరస్ నిర్దారణ ఫలితాలు వస్తాయని ఆసుపత్రి సిబ్బంది జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా 80మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ ప్యాకెట్లను ఆఫ్ హోల్డ్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ ఫిలిప్ తిమోతి ఆధ్వర్యంలో కలెక్టర్ అందించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద  సంస్థ చైర్మన్ తిమోతికి  కలెక్టర్ దుస్సాలువతో సత్కరించారు.  ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా  ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో ప్రధమ బహుమతి క్రింద ఎల్ నిశాంత్ , శ్రీనివాస్ లకు రూ.3500/-లు,  ద్వితీయ బహుమతి క్రింద సిహెచ్ యతీరాజ్, భార్గవ్ రావు లకు రూ.2500/-లు, తృతీయ బహుమతిగా గాంధీవర్మ, హరిశంఖర్ లకు రూ. 2000/-నగదుతో పాటు సర్టిఫికేట్లను కలెక్టర్ అందించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చంద్రనాయక్,  డా. బగాది జగన్నాధం, డి.ఎల్.ఓ డాక్టర్ కె.లీల , డి.పి.ఎం ఉమామహేశ్వర రావు, డి.ఎన్.ఎం డాక్టర్ ప్రవీణ్, స్వచ్ఛంద సేవకులు మంత్రి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.