స్వచ్చ సర్వేక్షణ్ లో మెరుగైన స్థానమే లక్ష్యం..
Ens Balu
2
వీఎంఆర్డీఏ
2020-12-01 19:20:39
స్వచ్ఛ సర్వేక్షణ్ – 2021లో ఉన్నత ర్యాంకును సాధించేందుకు మరింతగా అధికారులు, సిబ్బంది క్రుషి చేయాలని జివిఎంసి కమిషనర్ డా.స్రిజన అన్నారు. మంగళవారం స్వచ్ఛ సర్వేక్షణ్ లో సంబందిత అధికారులు తీసుకుంటున్న చర్యలను కమిషనర్ వి.ఎం.ఆర్.డి.ఎ చిల్డ్రన్ ఎరేనా థియేటర్ లో సమీక్షించారు. ఈ సమావేశంలో ఆమె, మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ సూచికలకు అనుగుణంగా వివిధ జోనల్ స్థాయిలో ఏ విధంగా పనులు జరుగుతున్నాయో మదించి రేపటిలోగా జోనల్ వారీగా నివేదిక ఇవ్వాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. జాతీయ స్థాయి అధికారులు స్వచ్ఛ సర్వేక్షణ్ డాక్యుమెంటేషన్ లో ప్రతిపాదించిన విధంగా క్షేత్ర స్థాయిలో డిశంబర్, జనవరి నెలల్లో ఆకస్మికంగా ప్రత్యక్ష పరిశీలనా చేపడతారని అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఓ.డి.ఎఫ్. పరిశీలనకు గాని, డబ్ల్యూ పరిశీలనకు గాని, స్వచ్ఛ సర్వేక్షణ్ పరిశీలనకు గాని, విడివిడిగా బృందాలు వచ్చి ప్రత్యక్ష పరిశీలన చేపడతాయన్నారు.
స్వచ్ఛత యాప్ వినియోగంపై, వాటిలో అడిగిన అడిగే 7 ప్రశ్నలకుగాను జవాబులు ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లకు మరియు వార్డు శానిటరీ కార్యదర్సులకు సూచించారు. చెత్తను ఎక్కువగా వేసే ప్రాంతాలపై(జి.వి.పి.) దృష్టి సారించాలని వాటిని ప్రత్యేక ఆకర్షణ కలిగిన ప్రాంతాలుగా తీర్చిదిద్ది, చెత్తను పారవేయకుండా నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. ప్రజా మరియు సామాజిక మరుగుదోడ్డ్ల మరమ్మత్తులను త్వరితగతిన చేపట్టాలని, కాలువలలో చెత్తను నిలువరించే స్కాన్నర్ గ్రిల్స్ లను ఏర్పాటు చేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. ఎం.ఎస్.ఎఫ్. నందు మరియు ఎస్.టి.పి.ల వద్ద నిర్వహించే పనులకు లాగ్ బుక్కులు తయారు చేయించి తనిఖీలకు సిద్ధంగా ఉంచాలని కార్యనిర్వాహక ఇంజినీరు(మెకానికల్)ను ఆదేశించారు. బహిరంగ మలమూత్ర విసర్జన చేసిన వారి పైన, కాలువలో చెత్త వేసే ప్రజలుపైన, వ్యాపారస్తులపైన తగు చర్యలు తీసుకొని వారి నుండి అపరాధ రుసుములు వసూలు చేయాలని ఆదేశించారు.
నిషేదిత ప్లాస్టిక్ సామగ్రిని అమ్మే వర్తకులపైన, ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాదారుల వద్ద నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని సూచించారు. వార్డులలో ఇంటి వద్ద నుండి నేరుగా చెత్తను సేకరణ చేయడానికి ఏర్పాటు చేసిన ప్రైవేట్ వాహనాలను ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో మాత్రమే ఆరుబయటగల డస్ట్ బిన్ లు తొలగించాలని ఏ.ఎం.ఓ.హెచ్. లను, శానిటరీ ఇన్ స్పెక్టర్లను ఆదేశించారు. ఈ విధుల నిర్వహణలో అంతరాయం ఏర్పడ కుండా వార్డు స్థాయిలో కొంతమంది పారిశుద్ధ్య సిబ్బందిని, మినీ వాహనాన్ని రిజర్వ్ లో ఉంచాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు స్వచ్ఛ సర్వేక్షణ్ – 2021పై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా అందరికీ అవగాహన కల్పించారు. నీటి సరఫరా విభాగపు పర్యవేక్షక ఇంజినీరు వేణుగోపాల్ రావు మాట్లాడుతూ డబ్ల్యూ మార్కులు పూర్తిగా సాధించడానికి గాను, అందులోని అంశాలైన యు.జి.డి. కనక్షనులను ఏర్పాటు, సెప్టింకు ట్యాంకు క్లీనింగ్ విషయాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.
సంబందిత జోనల్ కమిషనర్లు వారి యొక్క జోనల్ స్థాయిలో చేపడుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ పనులపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, చీఫ్ మెడికల్ ఆఫీసరు డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ, పర్యవేక్షక ఇంజినీరు వేణుగోపాల రావు అందరు జోనల్ కమిషనర్లు, మెకానికల్ మరియ వాటర్ సప్ప్లై ఇంజినీరింగ్ అధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, వార్డు శానిటరీ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.