KGH గెజిటెడ్ ఉద్యోగులకు అండగా ఉంటాం..


Ens Balu
2
కెజిహెచ్
2020-12-05 12:01:08

విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి గెజిటెడ్ అధికారులకు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కారానికి తమ యూనియన్ ముందుంటుందని కేజీహెచ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అండ్ మెడికల్, హెల్త్ సర్వీసెస్ అర్బన్ ఏరియా కమిటీ అధ్యక్షులు సూరిబాబు అన్నారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ,  రాష్ట్ర కోర్  కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏ. అప్పారావు ఆధ్వర్యంలో విశాఖపట్నం అర్బన్ ఏరియా కమిటీ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు వివరించారు. అధ్యక్షునిగా డి. సూరిబాబు, ప్రధాన కార్యదర్శిగా యూనస్ అలీ, అసోసియేటెడ్ ప్రెసిడెంట్ సీ.హెచ్ జోగి రాజు, వైస్ ప్రెసిడెంట్ గా హెచ్. వీ. రమణ మూర్తి లను ఎన్నికయ్యారన్నారు. గౌరవ సలహాదారులుగా డాక్టర్ మైథిలి, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పీ. వీ సుధాకర్, విశాఖ డీఎమ్&హెచ్ఓ డాక్టర్ పీ. సూర్యనారాయణలు వ్యవహరిస్తారన్నారు. తమ సభ్యులకు ఇంటి స్థలాలు, బిల్డింగ్ సొసైటీ కి ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.  పీఆర్సీ స్కేల్ హెచ్చు తగ్గుదలపై కూడా పోరాడతామని సూరిబాబు తెలిపారు. రాష్ట్ర కమిటీ సహకారంతో  గెజిటెడ్ అధికారులకు అర్బన్ ఏరియా కమిటీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యుల పాల్గొన్నారు.