ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి..


Ens Balu
2
Mangalagiri
2020-12-05 12:05:33

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అన్ని పథకాలు అర్హులకు అందేలా బాధ్యతను తీసుకోవాలని బీసీ కార్పొరేషన్ చైర్పర్సన్ లకు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శనివారం ఆత్మకూరు గ్రామ పరిధిలో జాతీయ రహదారి పక్కనున్న సీకే కన్వెన్షన్లో వైఎస్సార్ సీపీ బీసీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. అనంతరం ఆయన మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బొత్స సత్య నారాయణ, శంకరనారాయణ, ఎంపీలు మోపిదేవి వెంకట రమణారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గోరంట్ల మాధవ్, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తదితరులతో కలసి మాట్లాడుతూ పదవులు తీసుకున్న నాయకులు బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్సార్ సీపీని బలోపేతం చేయాలని సూచించారు.  తద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలను ప్రభుత్వంలో భాగస్వాములు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదని అన్నారు. బీసీలంటే భారతదేశ సంస్కృతి అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని, ఆయనకు రాష్ట్రంలోని బీసీలంతా అండగా నిలవాలని కోరారు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రభుత్వం అంది స్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే బాధ్యత బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లదని పేర్కొన్నారు. తొలుత మహాత్మ జ్యోతిరావు పూలే, అంబేడ్కర్, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. వారి సేవలను కొనియాడారు.  బీసీల ఆత్మీయ సమ్మేళం నిర్వహణకు కృషి చేసిన ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్ రావు నారాయణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డిని మంత్రులు, ఎంపీలు అభినందించారు. ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, జోగి రమేష్, మధుసూదనయాదవ్, ఆదీప్ రాజ్, విడదల రజిని కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి పలు బీసీ కార్పొరేషన్ల ఛైర్పర్సన్ లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, పేరాడ తిలక్, పంగ కృష్ణవేణి నాయుడు, చీపురు రాణీ కృష్ణ, రాజాపు హైమావతి అప్పన్న, దుక్క లోకేశ్వర్ రెడ్డిలను సత్కరించారు.