వారంతా పర్యాటక శాఖలో నమోదు కావాలి..


Ens Balu
2
Anantapur
2020-12-05 13:17:36

ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక వాణిజ్యం (నమోదు, సౌకర్యం) మార్గదర్శకాలు 2020 ప్రకారం జిల్లాలో ఉన్న టూరిజం సర్వీస్ ప్రొవైడర్లు ఖచ్చితంగా టూరిజం శాఖ వద్ద నమోదు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా పర్యాటక మండలి చైర్మన్ గంధం చంద్రుడు చెప్పారు. శనివారం ఆయన అనంతపురం లో మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని హో టళ్ళు, రిసార్ట్లు, రెస్టౌరంట్లు, గెస్ట్ హౌసులు, సర్వీస్ అపార్టుమెంట్లు, ఫంక్షన్ హాళ్లు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, బోట్ఆపరేటర్లు, వాటర్ స్పోర్ట్స్ ఆపరేటర్లు , ఏదైనా పర్యాటక సంబంధిత ఆపరేటర్లు ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలకు, పథకాలకు, ప్రొత్సాహకాలు, రాయితీలకు టూరిజం శాఖ వారి వద్ద  తప్పనిసరి నమోదు చేసుకోవాల్సి వుందన్నారు. ఇలా నమోదు చేసుకున్న వాటికి మాత్రమే టూరిజం గుర్తింపు వుంటుందని కలెక్టర్ తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్నివివరాలకు దగ్గర్లోని టూరిజం కార్యాలయంలో సంప్రదించాలన్నారు.