సేవా మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళుతుంది..


Ens Balu
3
Amalapuram
2020-12-05 16:55:52

సేవాభావం తో చేసే కార్యక్రమాలు పది కాలాలపాటు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. శనివారం మంత్రి అమలాపురం లో వేంచేసియున్న  శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో నూతనంగా నిర్మించిన రెండు ఏ.సి సూట్ రూమ్ లను,ఒక వాటర్ టాంక్ ను మంత్రి ప్రారంభించారు.  అతిథి గృహాల లో   ఒకటి స్థానిక ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్, సాయితేజ కన్స్ట్రక్షన్స్ అధినేత  మండేల నాగ వెంకట ప్రసాద్(బాబి) తన తల్లిదండ్రులు  కీ.శే. మండేల తాతారావు,శ్రీమతి లలిత జ్ఞాపకార్థం నిర్మించినది కాగా కీ.శే. అరిగెల శ్రీరామమూర్తి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు భద్రకాళి గ్రూప్స్ అధినేత ఏ.వి.వి.ఎస్. నాయుడు(బుజ్జి) నిర్మించారు .  అలాగే వాటర్ టాంక్ ను విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి గోకరకొండ  గోపి నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తులకు అందించే సేవాకార్యక్రమాలు లో భాగంగా తల్లిదండ్రుల పేరున చిరస్థాయిగా నిలిచిపోయే లా అతిధి గృహాలను నిర్మించిన  బుజ్జి, బాబి లతో పాటు గోపిని మంత్రి విశ్వరూప్ అభినందించారు. ఈ కార్యక్రమంలో  దేవస్థానం చైర్మన్మా కర్రి రాఘవ మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, బోనం కనకయ్య, యాళ్ల దొరబాబు, టిడిపి ఆర్గనైసింగ్మె సెక్రటరీ మెట్ల  రమణ బాబు, మాజీ చైర్మన్ చిక్కాల గణేష్, చెల్లుబోయిన శ్రీనివాస్, మట్టపర్తి నాగేంద్ర, వాసంశెట్టి సత్యం,కల్వకొలను తాతాజీ , నిమ్మకాయల జగ్గయ్య నాయుడు, వంటెద్దు వెంకన్నయుడు, మామిడిపల్లి శ్రీను,డాక్టర్ ధనవంతరి నాయుడు, డాక్టర్ గంధం విశ్వనాధ్, బండిగుప్తపు పాండు రంగ, కొత్తూరి శ్రీను, దేవస్థానం చైర్మన్ల కల్వకొలను  బాబి, సంగినేడి బాబులు, కాళే వెంకటేశ్వర్లు, ఏడిద శ్రీను, సుంకర సుధ  మాజీ చైర్మన్ కర్రి దత్తుడు, ఈ.ఓ బొక్కా వెంకటేశ్వరావు, అశెట్టి అదిబాబు  నల్లా పవన్, మోకా వెంకట సుబ్బారావు  తదితరులు పాల్గొన్నారు.