గ్రామస్థాయిలోనే సేవలన్నీ అందాలి..
Ens Balu
2
Pusapatirega
2020-12-05 17:01:20
గ్రామసచివాలయాల పరిధిలోని ప్రజలకు పూర్తిస్థాయి సేవలు అందజేయాలని జాయింట్ కలెక్టర్ ( ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు సిబ్బందిని ఆదేశించారు. శనివారం పూసపాటిరేగ మండలం రెల్లివలసలోని గ్రామ సచివాలయాన్నిజెసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని సిబ్బంది హాజరు శాతాన్ని, రికార్డులను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు, బియ్యం కార్డుల పంపిణీ వివరాలను అడిగారు. వైఎస్ఆర్ జలకళ, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలకు వచ్చిన దరఖాస్తులపై వాకబు చేశారు. ఇ-రిక్వెస్టులు పెండింగ్‌పై ఆరా తీశారు. వివిధ ప్రభుత్వ పథకాలపై సిబ్బందిని ప్రశ్నించారు. వాటి అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతీఒక్కరికీ ప్రభుత్వ పథకాలను సకాలంలో అందించాలని సూచించారు. సకాలంలో విధులకు హాజరు కావాలని, ప్రజలకు అందుబాటులో ఉండి, మెరుగైన సేవలను అందించాలని జెసి వెంకటరావు సిబ్బందిని ఆదేశించారు.