అభివ్రుద్ధి పనుల్లో రాజీపడొద్దు..


Ens Balu
2
Tuni
2020-12-05 17:25:26

తుని మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ది పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని  జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి.రాజకుమారి, ప్రత్యేక అధికారి హోదాలో తుని మున్సిపాలిటీలో పర్యటించి పట్టనంలో చేపట్టిన వివిధ అభివృద్ది పనులను తనిఖీ చేసారు.  ఇందులో భాగంగా ఆమె 14వ ఆర్ధిక సంఘం నిధులు కోటీ 15 లక్షల రూపాయలతో తుని పట్టనంలో జరుగుతున్న సిమ్మెంట్ రోడ్లు, డ్రెయిన్ల పనులను పరిశీలించి పనులు చిరకాలం నిలిచి ఉండేలా నాణ్యతా ప్రమాణలతో నిర్వహించాలని సూచించారు.  పట్టనంలో గృహాల నుండి తడి, పొడి చెత్త సేకరణ కార్యక్రమాన్ని,  బాలభవనం వద్ద 5 లక్షలు సాధారణ నిధులతో చేపట్టిన మెటిరీయల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ పనుల పురోగతిని సమీక్షించారు.  అలాగే బ్యాంకుపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను, 14వ ఆర్థిక సంఘం నిధులు 35 లక్షలతో నిర్మిస్తున్న ప్రహరీ గోడ పనులను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. తదుపరి ఇసుకపేటలోని వార్డు సచివాలయం-10ను ఆకస్మికంగా సందర్శించి వివిధ ప్రభుత్వ సంక్షేమాల పధకాలను అమలు చేస్తున్న తీరును ఫంక్షనరీలతో సమీక్షించారు.  ప్రజల నుండి అర్జీలను పారదర్శకంగా, త్వరితగతిన పరిష్కరించాలని, ఆయా పధకాల ప్రయోజనాలను లక్ష్యిత వర్గాలకు ముంగిటే అందించి వారి సంతృప్తిని, హర్షాన్ని అందుకోవాలని ఫంక్షనరీలకు సూచించారు.  అనంతరం మున్సిపల్ ఆఫీసులో కమీషర్, మున్సిపల్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి పట్టనంలో పారిశుద్యం, త్రాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నివారణ, పన్నుల సేకరణ, పౌర సేవలు, మున్సిపల్ ఆస్తుల అభివృద్ది, పరిరక్షణ తదితర అంశాలను సమీక్షించి వాటి పటిష్ట అమలుకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమాల్లో తుని మున్సిపల్ కమీషనర్, మున్సిపల్ ఇంజనీరింగ్, ప్రజారోగ్య, పాలనా విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.