“సృజనా’’త్మకంగా ప్రణాళికలుండాలి..


Ens Balu
3
Visakhapatnam
2020-12-05 18:13:57

జివిఎంసి పరిధిలోని పాఠశాలల్లో పిల్లలకు అర్ధమయ్యే రీతిలో నాడు-నేడు పథకం ప్రణాళికు రూపొందించాలని కమిషనర్ డా.స్రిజన అధికారులను ఆదేశించారు. శనివారం వి.ఎం.ఆర్.డి.ఏ. చిల్డ్రన్ ఎరేనా థియేటర్లో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావుతో కలసి విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాబోయే ఫిబ్రవరి–2021నెల నుంచి పాఠశాలల్లో ప్రారంభమయ్యే నాడు-నేడు ఎంతో చక్కగా ఉండాలన్నారు.  నాడు-నేడు పధకంలో ప్రధాన భాగాస్వామ్యులైన తల్లిదండ్రుల కమిటీలకు విద్యార్ధులకు అవసరమయ్యే విధంగా నూతన ప్రణాళికలు రూపొందించడంపై అవగాహన పెంపొందించాలని ఆదేశించారు. స్మార్ట్ సిటీ పధకంలో భాగంగా సిటీ ప్రాజెక్టు క్రింద 50స్కూళ్ళలో పలు అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. ఈ పధకంలో చేపడుతున్న పనులు, సాధారణ ఇంజినీరింగు పనులుగా సిమెంటు, ఇసుక, ఇటుక పనులు వలే కాకుండా, “సృజన” తో కూడిన పనులుగా చేపట్టాలని “సృజన” పేర్కొన్నారు. “బాల” (బిల్డింగ్ ఏజ్ ఎ లెర్నింగ్ ఎయిడ్) విధానంలో ప్రణాళికలు రూపొందాలని, అప్పుడే ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మన పాఠశాలలు పోటీని ఎదుర్కొంటాయని సూచించారు.          పిల్లలు సామాజిక వికాసాభివృద్ధికి పాఠశాలలు ఒక స్ప్రింగు బోర్డులా తోడ్పాటునందించాలన్నారు. దైనందింక జీవనంలో మంచి అలవాట్లుగా  ప్లాస్టిక్ వినియోగ నిషేధం, చెత్తను వేరు చేసి, పారిశుద్ధ్య కార్మీకుడికి అందించడం, ఆరుబయట మలమూత్ర విసర్జన చేయకుండా ఉండటం వంటి అలవాట్లు విద్యార్ధులకూ, ఉపాధ్యాయులు నేర్పించాలని కోరారు. పాఠశాలలు ప్రస్తుతం ప్రారంబమైనందున, పాఠ్యబోధనా ప్రణాళికలను తయారు చేసి, వచ్చే శనివారంలోగా ప్రధాన కార్యాలయానికి సమర్పించాలని ప్రదానోపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్ధిని, విద్యార్దుల మానసిక వికాసాభివృద్ధికి గాను క్రీడా పోటీల నిర్వహణ, స్టడీ టూర్ వంటివి రాబోతున్న కాలంలో నిర్వహిస్తామని వీటిపై తగుసూచనలు ఉపాధ్యాయులు అందించాలని కోరారు. ప్రభుత్వం మంజూరు చేసిన విద్యాకానుక కిట్లు విద్యార్ధులకు అందించేటట్లు తగు చర్యలు చేపట్టాలన్నారు.     అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు మాట్లాడుతూ, వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శులు, ప్రతీ పాఠశాలనందు స్వచ్ఛ సర్వేక్షణ్ – 2021పై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలన్నారు. విశాఖను స్వచ్ఛ సర్వేక్షణ్ లో మూడవ ర్యాంకు లోపు ర్యాంకు సాధించడానికిగాను విద్యార్ధులకు అవగాహన కల్పించాలని యాప్ ను వినియోగించడం, 7 ప్రశ్నలపై అవగాహన కల్పించడం, ర్యాలీలు నిర్వహించడం వంటివి పాఠశాలల విద్యార్ధులు, ఉపాధ్యాయులు ద్వారా చేపట్టాలన్నారు. ప్రతీరోజూ డైరీ నిర్వహణ, రిజిస్టర్లను నిర్వహించడం వంటివి చేపట్టాలని కార్యదర్శులను ఆదేశించారు. విద్యార్ధుల డ్రాపౌట్స్ జాబితా చేతిలో పట్టుకొని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి విద్య ఆవశ్యకతను వివరించి పాఠశాలలో చేర్చడానికి తగుచర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు, జివిఎంసి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రోసెసింగు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.