ఏయూ విసికి అభినందనల వెల్లువ..


Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-12-05 19:06:27

ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని మాదిగ కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌కె.కనకారావు, రెల్లి కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌వి.మధుసూధన రావులు మర్యాదపూర్వకంగా కలిసారు. పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. వీసి ప్రసాద రెడ్డిని విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల అసోసియేషన్‌ ‌సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసారు. వీసీగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంధర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు, ఆంధ్రప్రదేశ్ లోనే ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్శిటీకి విసిగా పనిచేసే అవకాశం వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో దక్కిందని, మీ హాయాంలో యూనివర్శిటీ మరింత అభివ్రుద్ధి చెందాలని ఆకాంక్షించారు.