ఉపాధి అవకాశాల కోర్సులపై శిక్షణనివ్వాలి
Ens Balu
3
Srikakulam
2020-12-05 20:32:47
ఉపాధి అవకాశాలను కల్పించే కోర్సులపై శిక్షణను అందించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నైపుణ్య అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో లభ్యమయ్యే జీడిమామిడి, అనాస, కొబ్బరి తదితర పంటలకు విలువ ఆధారిత శిక్షణను అందించాలని ఆదేశించారు. అదే విధంగా యువతకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులను ఎంపిక చేయాలని, వారికి నైపుణ్యం అభివృద్ధి చేయాలని తెలిపారు. జేసిబి, ప్రొక్లైనెర్, ఇండస్ట్రియల్ క్రేన్, వెల్డింగ్ తదితర రంగాల్లో సైతం అవకాశాలను, సిఎన్ సి మెషిన్ ఆపరేషన్ లో శిక్షణకు అవకాశాలు పరిశీలించాలని తెలిపారు. అకౌంటింగ్ టాలి కోర్సులను ప్రవేశ పెట్టాలని సూచించారు. గ్రామ సచివాలయాల పశుసంవర్ధక సహాయకులు, సర్వేయర్లు, తదితర పోస్టులకు అవసరమైన కోర్సులు విశ్వవిద్యాలయం లో ప్రవేశ పెట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాలో యువత మంచి నైపుణ్యం కలిగిన వారుగా ఆవిర్భవించాలని, ఏ రంగంలో నైనా అవలీలగా ప్రవేశించే స్థాయి ఉండాలని ఇందుకు మంచి ప్రామాణిక శిక్షణ కల్పించాలని తెలిపారు. నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ డా.ఎన్.గోవింద రావు మాట్లాడుతూ నైపుణ్య అభివృద్ధి కోర్సులపై ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో తెలియజేయాలన్నారు. కె.వి.కె. సీనియర్ శాస్త్రవేత్త చిన్నం న్నాయుడు మాట్లాడుతూ, వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన మరమ్మత్తులపై శిక్షణను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, సమగ్రగిరిజన అభివృధ్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి శ్రీధర్, జల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు శాంతిశ్రీ, మెప్మా పి.డి. కిరణ్ కుమార్, డి.ఐ.సి. జనరల్ మేనేజరు బి.గోపాల కృష్ణ, ఉపాధి కల్పనాధికారి డి.అరుణ, డిఆర్ డిఎ జెడిఎమ్ సి.హెచ్.రామ్ మోహన్ రావు, ఎన్.వై.కె. కో ఆర్డినేటర్ డి.శ్రీనివాసరావు, నెరేడ్ డైరక్టర్ తిరుమల కుమార్, జిల్లా స్కిల్ డెవలెప్ మెంట్ ఆఫీసరు ఎన్.గోవింద రావు, ఛీఫ్ కోచ్ బి.శ్రీనివాస కుమార్, అంబేద్కర్ విశ్వ విద్యాలయ ఎగ్జిక్యూటివ్ మెంబరు రాజేష్, గ్రైనైట్ ఫాక్టరీస్ అసోసియేషన్ అధ్యక్షులు రమాకాంత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.