సకాలంలో బ్యాంకర్లు రుణాలు అందించాలి..
Ens Balu
3
Tirupati
2020-12-05 20:35:50
సకాలంలో రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రభుత్వ రుణ పథకాల పై బ్యాంకర్ల తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించాలన్నారు. వీలైనంత త్వరగా లబ్ధిదారుల ఖాతాలకు రుణాలను జమ చేసేందుకు బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసే విషయంలో సచివాలయ సిబ్బంది బ్యాంకర్లకు సహకారం అందించాలన్నారు. వీధి విక్రయదారులకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 7 వ తేదీ సోమవారం జిల్లాలో పెద్ద ఎత్తున రుణ పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ బ్యాంకర్ల ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) వి. వీరబ్రహ్మం, ఇండియన్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కె. శ్రీనివాస్, కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కె. రమణ మూర్తి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ జి ఎం రామ కృష్ణా రెడ్డి, ఎల్ డి ఎం గణపతి, మెప్మా పిడి జ్యోతి, వివిధ, బ్యాంకులకు చెందిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.