ఇద్దరు సచివాలయ ఉద్యోగుల సస్పెన్షన్..


Ens Balu
1
ఎచ్చెర్ల
2020-12-05 20:37:36

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం సంతసీతారాం పురం మహిళా పోలీసు, గ్రామ సచివాలయ అడ్మిన్ పంచాయతీ కార్యదర్శిని సస్పెన్షన్ చేసినట్లు వార్డు, గ్రామ సచివాలయ, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. సంతసీతారాం పురం మహిళా పోలీసు విధులకు గైర్హాజరు కావడం జరుగుతుందని విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు. కార్యాలయానికి గైర్హాజరు కావడమే కాకుండా ఇంటి వద్ద నుండి బయోమెట్రిక్ హాజరు వేయడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తుండటం జరుగుతుందని, అందుకు అడ్మిన్ పంచాయతీ కార్యదర్శి సహకరిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో నిరూపణ జరగిందన్నారు. ఇద్దరిపై ఫోర్జరీ కేసుతో సహా విధులకు గైర్హాజరుపై  క్రమశిక్షణా చర్యలను చేపట్టడం జరుగుతుందని ఆయన స్ఫష్టం చేసారు. ఇద్దరిని సస్పెన్షన్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గ్రామ సచివాలయ నిర్వహణ పర్యవేక్షణలో అలసత్వం వహించినందుకు గ్రామీణ అభివృద్ధి కార్యనిర్వాహక అధికారి (ఇఓ పిఆర్ డి)కి, మండల పరిషత్ అభివృద్ధి అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేసామని ఆయన పేర్కొన్నారు.