పుస్తక పఠనాసక్తిని పెంపొందించాలి..
Ens Balu
3
ఆంధ్రాయూనివర్శిటీ
2020-12-05 20:44:39
విద్యార్థుల్లో పుస్తక పఠనాసక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. శనివారం మద్యాహ్నం ఏయూ వీసీ కార్యాలయంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ఇంజనీరింగ్ మేథమేటిక్స్ విభాగం ఆచార్యులు వి.వి బసవ కుమార్ రచించిన గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ మేథమేటిక్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ శాస్త్రీయ అంశాలతో పుస్తకాలను రచించడం ఎంతో క్లిష్ణమైన పక్రియ అన్నారు. విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో, ఆసక్తి కరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో పుస్తక రచన చేయడం అభిలషనీయమన్నారు. పుస్తక రచయిత బసవ కుమార్‌ను అభినందించారు. పుస్తక రచయిత ఆచార్య వి.వి బసవ కుమార్ మాట్లాడుతూ పుస్తకంలో సులభంగా అర్ధమయ్యే విధంగా విషయాలను తెలియజేయడం, ఎక్కువగా ఉదాహరణలో వివరించడం, గణిత భావనలు విపులంగా తెలియజేయడం జరిగిందన్నారు. లీనియర్ ఆల్‌జీబ్రా-కాలిక్యులస్, న్యూమరికల్ మెథడ్స్, సీరీస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ట్రాన్స్‌ఫార్మర్స్, కాంప్లెక్స్ అనాలసిస్, స్టాటస్టిక్స్-ప్రోబబులిటీ, లీనియర్ పోగ్రామింగ్ తదితర అంశాలను పొందుపరచడం జరిగిందన్నారు. గతంలో సైతం తాను రచించిన న్యూమరికల్ అనాలసిస్- ఇంటరాటివ్ మెథడ్స్ పుస్తకానికి మంచి ఆదరణ లభించిందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాస రావు ఇంజనీరింగ్ మేథమేటిక్స్ విభాగాధిపతి శాంతి సుందర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.