సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌కు రూ.2 కోట్లు నిధులు..
Ens Balu
2
ఆంద్రాయూనివర్శిటీ
2020-12-05 20:47:11
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజీనిరింగ్ కళాశాలలోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌కు రూ 2 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాస రావు, టెక్విప్ సమన్వయకర్త ఆచార్య భాస్కర రెడ్డిలను వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అభినందించారు. టెక్విప్ 2 పథకంలో ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశలకు రూ 7 కోట్లు మంజూరు అయిందని, దీనికి అదనంగా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌నుకు అదనంగా రూ 2 కోట్లు మంజూరు చేసినట్లు వీసీకి వివరించారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో భాగంగా నానో టెక్నాలజీ సెంటర్, ఫ్యూయల్ సెల్స్ ల్యాబ్‌లను ఏయూ ఇంజనీరింగ్ కళాశాల నెలకొల్పి పరిశోధనలు జరుపుతోందన్నారు. ఈ నిధులను ఈ పరిశోధన కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా వినియోగిస్తామన్నారు.
ఈ సందర్భంగా వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ వర్సిటీలో పరిశోధనలకు, ఆవిష్కరణలకు అధిక ప్రాధాన్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఆచార్యులు, పరిశోధకులు నవ్య, సమాజ ఉపయుక్తంగా పరిశోధనలు, ఆవిష్కరణలు జరపాలన్నారు.ఈ దిశగా వర్సిటీ పరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. నిధులను ఉపయుక్తంగా నిలుపుకుంటూ పరిశోధన కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తూ నిర్ధేశిత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.